Ad Code

Ticker

6/recent/ticker-posts

విశ్వబ్రాహ్మణులు ఎవరు? వారు(విశ్వకర్మలు) చేయు వృత్తులు ఏవి?/ABOUT VISWABRAHMIN...


విశ్వకర్మ భగవానుడు  సర్వ దిక్కులను పరికించు దృష్టి కలిగిన అమిత శక్తి కలవాడు.  మహాభరతము ఈయనను వేయికళలకు అధినేతగా అభివర్ణించినంది. ఈతని అర్చామూర్తిని విశ్వకర్మ పురాణము పంచ శీర్షుడుగా వర్ణించింది. సృష్టి తొలినాళ్ళ నుంచి సుప్రసిద్దులైన శిల్పకారులు ఐదు మంది ఉన్నారు. వారు విశ్వకర్మకు జన్మించారు.  

విశ్వకర్మ యొక్క పంచ ముఖాల నుండి మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ బ్రహ్మలు ఉద్భవించారు, ఈ పంచ బ్రహ్మల నుండి వారి సంతతి అయిన ఐదుగురు (సనగ, సనాతన, అహభౌసన, ప్రత్నస, సుపర్ణస.) విశ్వబ్రాహ్మణులు ఉద్భవించారు.
వారు వరసగా లోహ, దారు, కాంస్య, శిల్ప, స్వర్ణ రూపకారులుగా ప్రసిద్ధి పొందారు.

సనగ : ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో మను ముఖం నుండి వచ్చినవాడు. ఈయనకు మూలాఆధారం శివుడు. ఇతను చెప్పే శాస్త్రం తర్కం. ఈయన వృతి అయో శిల్పి. అంటే  కమ్మరి.   ఇనుము పని చేయును.

సనాతన : ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో మయ ముఖం నుండి వచ్చినవాడు. ఈయనకు మూలాఆధారం విష్ణువు. ఇతను చెప్పే శాస్త్రం వ్యాకరణం. ఈయన వృతి దారు శిల్పి. అంటే  వడ్రంగి .   కొయ్య పని చేయును.

అహభునస బ్రహ్మర్షి : ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో త్వష్ట ముఖం నుండి వచ్చినవాడు. ఈయనకు మూలాఆధారం బ్రహ్మ. ఇతను చెప్పే శాస్త్రం ధర్మశాస్త్రం. ఈయన వృతి తామ్ర శిల్పి. అంటే  కంచరి.  రాగి, కంచు, ఇత్తడి పని చేయును.

ప్రత్నస : ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో దైవజ్ఞ ముఖం నుండి వచ్చినవాడు. ఈయనకు మూలాఆధారం ఇంద్రడు. ఇతను చెప్పే శాస్త్రం మీమాంస. ఈయన వృతి శిలా శిల్పి. అంటే శిల్ప కారుడు.   రాతి పని చేయును.

సుపర్ణస : ఈ బ్రహ్మర్షి విశ్వకర్మ ముఖములో విశ్వజ్ఞ ముఖం నుండి వచ్చినవాడు. ఈయనకు మూలాఆధారం సూర్యడు. ఇతను చెప్పే శాస్త్రం వైధ్యం, జ్యోతిష్యం. ఈయన వృతి స్వర్ణ శిల్పి. అంటే  స్వర్ణకారుడు.   బంగారు పని చేయును.

విశ్వకర్మ జయంతి రోజున అందరూ తమ వృత్తిపనుల్లో ఉపయోగపడే వస్తువులను విశ్వకర్మ చిత్రపటం ముందు పెట్టి పూజించాలి.ఈ రోజున పనిముట్లను పూజిస్తాం కనుక వాటిని వాడకూడదు. వృత్తిపనులను చేయకూడదు.    

విశ్వబ్రాహ్మణులు చేయు పంచ వృత్తులు-వివరణ
గ్రామంలో ఒక స్థలంలో ఈ ఐదు వృత్తులనూ చేస్తూ గ్రామానికి కావల్సిన వస్తువులను సమకూర్చేవారు. ఆ స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవాళ్ళు..

1. కమ్మరి : - పంచ వృత్తులలో మొట్టమొదటి వృత్తి కమ్మరము (అయో కారుడు). ఇనుమును కరిగించి వస్తువును తయారు చేసి ప్రపంచ పారిశ్రామిక వ్యవస్థకు మూల పురుషుడు లోహశిల్పి కమ్మరి. కమ్మరి ముడి ఇనుమును సంగ్రహించడం, ఇనుమును తయారు చెయ్యడం, ఆ ఇనుముతో వ్యవసాయానికి కావల్సిన కొడవళ్ళ, పార, పలుగు, గునపం, గొడ్డలి, బండికట్టు మొదలైనవి, దేశానికి కావల్సిన వంతెనలు,  పడవలు, ఫిరంగులు, కత్తులు ... ఇనుప వస్తువు ప్రతిదీ చేసి ఇచ్చే మొట్ట మొదటి మెటల్ ఇంజనీర్
 2. వడ్రంగి :- పంచ వృత్తులలో రెండవ వృత్తి ఈ వడ్రంగము వడ్రంగి కలపతో వస్తువులు తయారుచేయు వృత్తిపనివాడు. వడ్రంగి (దారు కారుడు) వ్యవసాయానికి కావల్సిన కాడి, మేడి, నాగలి, బండి..మొదలైనవీ, ప్రజలకు కావల్సిన తలుపులు,  పీట, మంచం, కుర్చీలు మొదలగునవి. మానవ జీవిత చరిత్రలో అభివృద్ధికి మొట్ట మొదటి మెట్టయిన 'చక్రం'...చక్కతో తయారయ్యే ప్రతిది...పిల్లలు ఆడుకునే బొంగరం నుండి దేవుణ్ణి ఊరేగించే రథం వరకూ, ఊయల నుండి పడవల వరకు..తయారు చేసే మొట్ట మొదటి వుడ్ ఇంజనీర్. వీరిని వడ్ల కమ్మరి మరియు ఆంగ్లంలో కార్పెంటర్స్ (Carpenters) అని అంటారు.  

3. కంచరి :- పంచ వృత్తులలో మూడవ వృత్తి కంచరి (కాంస్యకారుడు) ప్రజలకు కావల్సిన ఇత్తడి, రాగి, కంచు పాత్రలు ఉగ్గు గిన్నెల దగ్గర్నుండి గంగాళాల వరకు ... ముడి ఇత్తడి సంగ్రహించడం దగ్గర్నించి, దానిని ఇత్తడిగా, రాగిగా, కంచుగా మార్చి కరిగించి కావల్సిన ఆకారం లోకి పోత పోసే వరకు ఉద్ధరిణిల దగ్గరినుండి ఊరేగింపు వాహనాల వరకూ, దేవాలయాలలో పంచలోహా విగ్రహాలను మొదలగునవి ... ప్రతి పని చేసే మొట్ట మొదటి మెటల్ అల్లాయ్ ఇంజనీర్.


4. శిల్పి :- శిల్పకారుడు (శిల్పి) అంటే రాళ్ళను విగ్రహాలుగా చేసేవాడు అని కాదు. ఏదైనా తయారు చేసే వాడు (క్రియేటర్) అని అర్థం. దురదృష్టవశాత్తూ, శిల్పి అంటే శిల్పాలు చెక్కే వాడు అని అర్థం మారిపోయింది. శిల్పి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ నాడు మన భారత దేశంలో మనం చూస్తున్న విగ్రహాలు, అద్భుతమైన దేవాలయాలు, మహా మహా నిర్మాణాలు, వంతెనలు, శిలా శాసనాలు, అజంతా ఎల్లోరా గుహలు, కోటలు, మహల్ లు, చెరువులు, ఏకశిలా రథాలు,...... ఎన్ని చేశారో మహానుభావులు. వీరినే 'స్థపతులు' అని అంటారు. జంతర్ మంతర్, నలందా విశ్వ విద్యాలయం, తాజ్ మహల్, బేలూర్, హాలిబేడు, బాదామి గుహలు, హంపి, అజంత, ఎల్లోరా గుహలు, వేయి స్తంభాల గుడి, రామప్ప గుడి, త్రివేండ్రం లోని అనంత పద్మనాభ స్వామి, మహా బలిపురం, తిరుపతి, శబరిమల, ఎర్రకోట, గోమఠేశ్వర, మధుర మీనాక్షి, హైదరాబాద్ లోని బుద్ధ విగ్రహంమొదలగునవి...... శిలా నిర్ణయం దగ్గర నుండి విగ్రహాలు చెయ్యడం దగ్గర నుండి, స్థల పరీక్ష దగ్గర నుండి, వాస్తు పూజ దగ్గర నుండి, భవన లేదా దేవాలయ ప్లాన్ దగ్గర నుండి... గృహ ప్రవేశం లేదా దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపనాధికార పర్యంతం...వీరు చెయ్యలేని పని లేదు. వీరు ప్రపంచ దేశాలలో భరత ఖండాన్ని సగర్వంగా తల ఎత్తుకునేలా చేసిన పుణ్య మూర్తులు. భారత దేశానికి పర్యాటకం మీద ఆదాయం రావడానికి మూలకారణం వీరి చలవే. వీరి కట్టాడాలలోని నైపుణ్యాన్ని, రహస్యాలను ఈనాటికీ మేటి విదేశీ సైంటిస్ట్ లు సైతం అందుకోలేక పోతున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అసలైన ఇంజనీర్లు. 


5. స్వర్ణకారి : - స్వర్ణకారుడు అంటే ముడి బంగారాన్ని సేకరించి దాని నుండి అసలైన బంగారం గ్రహించి, దానికి రత్న మాణిక్యాలను కూర్చి, దాన్ని అనుభవ యోగ్యంగా, ఆభరణాలుగా, శిల్పాలుగా, పాత్రలుగా మార్చగలిగినవాడు . ముడి వెండి నుండి పాత్రలు, పూజకు వాడే వస్తు సామగ్రి, కాళ్ళకు పట్టిలు మొదలగునవి.
 ఈ ఐదు వృత్తుల వారిని విశ్వకర్మ వారసులని విశ్వబ్రాహ్మణులని చెప్పబడ్డారు.

Post a Comment

0 Comments