Ad Code

Ticker

6/recent/ticker-posts

ఋతువులు - కాలాలు/RUTHUVULU IN TELUGU



ఋతు గమనం ఉగాది నుంచే ప్రారంభమవుతుంది.   కాలం దైవం  అధీనం కాబట్టి కాలచక్రానికి చిహ్నాలైన రుతువులు కూడా దైవం  కనుసన్నల్లోనే ఉంటాయి.  

సంవత్సరానికి ఆరు ఋతువులు. తెలుగు వారికి తెలుగు నెలల ఆధారంగా ఈ ఋతువులు ఉంటాయి.

1.వసంత ఋతువు: ఛైత్ర, వైశాఖ మాసాలు వసంత శోభతో కనువిందు చేస్తాయి. ఇది ఏడాదిలో వచ్చే మొదటి రుతువు. అన్నీ ఫలించి, పుష్పించే కాలమిది. అందుకే దీన్ని మధుమాసం అని కూడా అంటారు. దీనికి రాజు వసంతుడు.  

2. గ్రీష్మ ఋతువు: జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు గ్రీష్మ రుతువు. ఎండలు తీవ్రంగా ఉంటాయిప్పుడు. దీనికి అధిపతి గ్రీష్ముడు.   

3. వర్ష ఋతువు: శ్రావణ, భాద్రపద మాసాలు ఇందులో ఉంటాయి.  వరుణదేవుడు వజ్రంలా గర్జిస్తూ ఇంద్రధనుస్సు చేత పట్టుకుని వర్షాలు కురిపిస్తాడు.  

4. శరత్ ఋతువు: ఆశ్వయుజ, కార్తీక మాసాలు శరత్ ఋతువు. శీతల గాలులు, ప్రశాంత వాతావరణం ఉంటాయి.   

5. హేమంత ఋతువు: మార్గశిర, పుష్యమాసాలు హేమంత ఋతు శోభలతో ఉంటాయి. చలిగాలి, మంచు కురిసే కాలమిది. ఈ ఋతువుకు అధిపతి హేమంతుడు.  


6. శిశిర ఋతువు: మాఘ, ఫాల్గుణ మాసాలను శిశిర ఋతువుగా పిలుస్తారు. శీతలంగా ఉంటుంది. కొంచెం ఎండలు మొదలవుతాయి.  
కాలములు

రెండు ఋతువులు ఒక కాలం. అంటే ఒక కాలము నాలుగు మాసాలు ఉంటుంది. కనుక సంవత్సరానికి మూడు కాలాలు. అవి...


1. వేసవి కాలం

2. వర్షా కాలం

3. శీతా కాలం

వేసవి కాలం - చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ మాసాలు.

వర్షా కాలం - శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక మాసాలు.

శీతా కాలం - మార్గశిర, పుష్య, మాఘం, ఫాల్గుణం మాసాలు.

Post a Comment

0 Comments