వశిష్ఠుడు చెప్పినదంతా విని "మహానుభావా! తమరు చెప్పిన ధర్మములన్నింటినీ శ్రద్ధగా విన్నాను. దీనివల్ల ధర్మము చాలా సూక్ష్మమైనదని, పుణ్యము సులభముగా సంపాదించుకోవచ్చని తెలుసుకున్నాను. కేవలం నదీస్నానం, దీపదానము, ఫలదానము, అన్నదానం, వస్త్రదానం వలన అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుందని తెలియజేశారు. ఇటు వంటి స్వల్ప ధర్మములచేతనే మోక్షము లభిస్తుండగా, వేదోక్తముగా యజ్ఞయాగాదులు చేసినగాని, పాపములు పోవని మీవంటి మునిశ్రేష్ఠులే చెబుతుంటారు కదా! మరి తమరు ఈ వ్రత విధానాన్ని సూక్ష్మంలో మోక్షముగా విశదపరచడం, నాకు అమితాశ్చర్యమును కలుగజేస్తుంది .
దుర్మార్గులు కొందరు సదాచారములను పాటించక, వర్ణసంకరులై రౌరవాది నరకహేతువులైన మహాపాపములు చేసినవారు ఇంత తేలికగా మోక్షమును పొందడం వజ్రపు కొండను గోటితో పెకలించడం వంటిదే కదా! కాబట్టి దీనిలో దాగిఉన్న మర్మమును విడమర్చి, విపులంగా చెప్పాల్సిందిగా మిమ్మల్ని ప్రార్ధిస్తున్నాను అని కోరారు.
అప్పుడా వశిష్ఠులవారు చిరునవ్వు నవ్వి, "జనకమహారాజా! నీవు వేసిన ప్రశ్న సహేతుకమైనదే. నేను వేదవేదాంగములను కూడా పఠించాను. వాటిల్లో కూడా సూక్ష్మమార్గాలున్నాయి . వీటిల్లో సాత్విక, రాజస, తామసములు అని ధర్మము మూడురకములు.
సాత్త్విక ధర్మమం అంటే - దేశ, కాల పాత్రలు మూడూ సమకూడిన సమయములో ‘సత్త్వ’మనే గుణము జనించి, ఫలమంతా కూడా పరమేశ్వరార్పితము చేసి, మనోవాక్కాయ కర్మలచే నిర్వర్తించిన ధర్మము. ఇటువంటి ధర్మము ఎంతో ఉన్నతమైనది. సాత్త్వికధర్మము సమస్త పాపములను నాశనం చేసి, వ్యక్తులని పవిత్రులను చేసి దేవలోక, భూలోక సుఖములు చేకూర్చగలిగినది.
ఏవిధంగా అయితే, తామ్రపర్ణినది సముద్రములో సంగమించే స్థలాలలో, స్వాతికార్తెల కాలంలో, ముత్యపు చిప్పలో వర్షబిందువు పడి, ధగధగ మెరిసి, విశేషమైన రత్నమైన ముత్యముగా మారుతుందో, అదేవిధంగా - సాత్వికత వహించి, సాత్విక ధర్మ మాచరిస్తూ గంగ,యమున,గోదావరి కృష్ణనదులలో పుష్కరాలు మొదలైన పుణ్యకాలములలో స్నానమాచరించి, దేవాలయములలో వేదములు పఠించి, సదాచారుడై, కుటుంబీకుడైన బ్రాహ్మణునకు యెంత స్వల్ప దానం చేసినా, లేక ఆ నదీతీరములోని దేవాలయంలో జపతపాదులు చేసినా విశేష ఫలితాలు పొందగలరు.

అర్థమైనది కదా రాజా! ఇక రాజసధర్మాన్ని గురించి వివరిస్తాను. ఫలాపేక్ష కలిగి, శాస్త్రోక్త విధులను విడిచి చేసిన ధర్మం. ఆ ధర్మం పునర్జన్మహేతువై కష్టసుఖాలు కలిగించేదిగా ఉంటుంది.
ఇక తామస ధర్మము - శాస్త్రోక్త విధులను విడిచి దేశ కాల పాత్రలు సమకూడని సమయములో డాంబికాచరణార్ధం చేసే ధర్మం. ఇటువంటి ధర్మం ఫలము నీయదు.
దేశకాల పాత్రలు సమకూడినపుడు తెలిసిగాని, తెలియకగాని యే స్వల్పధర్మం చేసినా అది గొప్ప ఫలము నివ్వగలదు. ఉదాహరణకి పెద్ద కట్టెలగుట్ట చిన్న అగ్నికణములతో భస్మమైన చందాన శ్రీ మన్నారాయణుని నామము, తెలిసిగాని, తెలియకగాని ఉచ్ఛరించినట్లయితే వారి సకల పాపములు పోయి ముక్తిని పొందగలరు. దానిని తెలిపే యితిహాసమును వివరిస్తాను అంటూ ఆ కథని జనక మహారాజుకి ఈ విధంగా చెప్పసాగారు వశిష్ఠమహర్షి.

అజామీళుని కథ
పూర్వకాలములో కన్యాకుబ్జమనే నగరంలో నాల్గు వేదాలు చదివిన ఒక విప్రుడు ఉండేవాడు. అతని పేరు సత్యవ్రతుడు. సకల సద్గుణరాశి అయిన హేమవతి ఆయన భార్య. ఆ దంపతులు అన్యోన్యంగా ప్రేమ కలిగి అపూర్వ దంపతులని పేరు పొందారు. వారికి చాలా కాలమునకు లేక లేక ఒక కుమారుడు జన్మించాడు.
వారాబాబుని అతి గారాబంగా పెంచుతూ, ‘అజామీళుడని’ నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానమవుతూ, అతి గారాబము వలన పెద్దల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ, దుష్ట సావాసాలు పట్టి, విద్యాభ్యాసము విడిచి, బ్రాహ్మణ ధర్మాలు పాటించక తిరుగుతుండేవాడు.
ఈ విధంగా నుండగా, కొంతకాలమునకు యవ్వన దశ ఉదయించగా, మరింత చెలరేగి కామాంధుడై, మంచి చెడ్డలు మరచి, యజ్ఞోపవీతం త్రెంచి, మద్యం సేవిస్తూ, ఒక ఎరుకల జాతికి చెందిన స్త్రీని వలచి, నిరంతరము నామెతోనే గడుపుతూ, ఇంటికి రాకుండా, తల్లిదండ్రులను మరిచి, ఆమె చేతి వంట తింటూ ఉండేవాడు.
అతి గారాబము ఏవిధంగా పరిణమించిందో విన్నావా రాజా! తమ బిడ్డలపై ఎంత అనురాగమున్నా, దానిని ప్రదర్శించకుండా, చిన్ననాటి నుంచీ అదుపు ఆజ్ఞలలో ఉంచకపోతే, యీ విధంగానే జరుగుతుంది. ఆ విధంగా, అజామీళుడు కుల భ్రష్టుడు కాగా, అతణ్ణి వానిబంధువులు విడిచిపెట్టారు.

దాంతో అజామీళుడు మరింత రెచ్చిపోయి, వేటాడి పక్షులను, జంతువులను చంపుతూ, కిరాతవృత్తి చేపట్టి జీవించసాగాడు. ఒక రోజున ఆ యిద్దరు ప్రేమికులు అడవిలో వేటాడుతూ ఫలములు కొస్తుండగా, ఆ స్త్రీ తేనెపట్టుకై చెట్టెక్కి తేనెపట్టు తీయబోతూ కొమ్మ విరిగి క్రిందపడి చనిపోయెను. అజామీళుడు ఆ స్త్రీపై బడి కొంతసేపు యేడ్చి, తరువాత ఆ అడవిలోనే ఆమెను దహనం చేసి ఇంటికి చేరాడు.
ఆ స్త్రీని అజామిళుడు చేపట్టే ముందే, ఆమెకు ఒక కుమార్తె ఉంది. కొంత కాలమునకు ఆ బాలికకు యుక్తవయస్సు రాగా, కామాంధకారముచేత కన్నుమిన్ను గానక అజామీళుడు ఆ బాలికను కూడా చేపట్టి, ఆమెతో కూడి కాపురము చేయసాగాడు. వారికి యిద్దరు కొడుకులు కూడా కలిగారు. కానీ ఇద్దరూ పురిటిలోనే చనిపోయారు. ఆమె మళ్ళీ గర్భం ధరించి ఒక కుమారుని ప్రసవించింది.

వారిద్దరూ ఆ బాలునికి "నారాయణ" అని పేరు పెట్టి పిలుస్తూ, ఒక్కక్షణమైన ఆ బాలుని విడువక, యెక్కడకు వెళ్లినా వెంటబెట్టుకొని వెళ్ళేవారు. "నారాయణ - నారాయణ" అని ప్రేమతో సాకేవారు. కాని "నారాయణ" యని స్మరించినంత మాత్రాన తమ పాపములు నశించి, మోక్షము పొందవచ్చుననే జ్ఞానం మాత్రము అతనికి తెలియకపోయింది.
ఇలా కొంతకాలము జరిగిన తర్వాత, అజామీళునకు శరీరపటుత్వము తగ్గి, రోగగ్రస్తుడై మంచముపట్టి అవసానకాలంలో ఉన్నాడు. చివరి క్షణాలు ఆసన్నమవడంతో, భయంకరాకారములతో, పాశాది ఆయుధములు ధరించి యమభటులు అతనిముందు ప్రత్యక్షమయ్యారు. వారిని చూచి అజమీళుడు భయపడి, కుమారునిపై ఉన్న వాత్సల్యము వల్ల "నారాయణా, నారాయణా” ని కలవరిస్తూ, ప్రాణాలు విడిచాడు.

అజామీళుని నోట "నారాయణా" అనే శబ్దము వినబడగానే యమభటులు గడగడ వణకసాగారు. అదేవేళకు దివ్యమంగళాకారులు, శంఖ చక్ర గదాధరులూ అయిన శ్రీమన్నారాయణుని దూతలు విమానములో అక్కడికి వచ్చి "ఓ యమభటులారా! ఇతను మావాడు. మేము ఇతణ్ణి వైకుంఠమునకు తీసుకు పోయేందుకు వచ్చాము" అని చెప్పి, అజామీళుని విమాన మెక్కించి తీసుకుపోయే ప్రయత్నం చేశారు. అప్పుడా యమదూతలు "అయ్యా! మీకు సరైన సమాచారమున్నదా ? వీడు అతి దుర్మార్గుడు. వీనిని నరకమునకు తీసుకొనిపోయెందుకు మేమిక్కడికి వచ్చాము. కాబట్టి వీనిని మాకు వదలండి “ అని కోరారు. అప్పుడు విష్ణుదూతలు ఇలా సమాధానమిచ్చారు.
స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, ఎనిమిదవ అధ్యాయము, ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !
స్వస్తి !!
స్కాందపురాణాంతర్గత, వశిష్ఠప్రోక్త, కార్తీక మాహత్మ్యమందలి, ఎనిమిదవ అధ్యాయము, ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము.
సర్వం శ్రీ మహేశ్వరార్పణమస్తు !
స్వస్తి !!
0 Comments